Nandipet, 4-7-2026
జమబదపోసకమషప.సచైతఆదేమేకఏసపమసతఅఆధంోచతఫోసబృందంందపేటపోససటేషపధోూతపమంసమపంోపేకటసథంపైఆకసమకదడహంచంద.ఈదడో10మందఅదపోకతసకదసెఫోహసధంచేసక.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్.ఆదేశాల మేరకు, ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో చీతా ఫోర్స్ బృందం చట్టవ్యతిరేక కార్యకలాపాల నిర్మూలనలో భాగంగా నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూత్పల్లి గ్రామం సమీపంలోని ఓ గెస్ట్ హౌస్‌పై విశ్వసనీయ సమాచారంతో ఆకస్మిక దాడి నిర్వహించింది.
ఈ దాడిలో గెస్ట్ హౌస్‌లో పేకాట ఆడుతున్న 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 58,490 నగదు, 10 సెల్ఫోన్లు, 5 మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితులు, స్వాధీనం చేసుకున్న నగదు, సెల్ఫోన్లు, వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం నందిపేట్ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఓ కు అప్పగించారు.
ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాట, జూదం, గుట్కా, మత్తు పదార్థాల విక్రయాలు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు.










