బాన్సువాడ, 6 November
కామారెడ్డి జిల్లా మండలం రాజారాం దుబ్బాలో అక్రమంగా నిల్వ ఉంచిన 75 గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు. డొమెస్టిక్ గ్యాస్‌ను కమర్షియల్ సిలిండర్లలోకి నింపి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించారు. ఈ వ్యవహారంలో సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
కామారెడ్డి జిల్లా మండలం రాజారాం దుబ్బాలో అక్రమంగా నిల్వ ఉంచిన 75 గ్యాస్ సిలిండర్లను సివిల్ సప్లై అధికారులు సీజ్ చేశారు. ఈ వ్యవహారంలో సంబంధిత వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
రాజారాం దుబ్బాకు చెందిన శంకర్ గౌడ్ అనే వ్యక్తి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల నుంచి కమర్షియల్ సిలిండర్లలోకి గ్యాస్ నింపుతూ అక్రమంగా విక్రయిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. అంతేకాకుండా, ఒక్కో సిలిండర్‌లో రెండు కిలోల గ్యాస్ తక్కువగా నింపి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి.
దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించి 75 సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఓ రవీందర్ రాథోడ్ తెలిపారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ డీటీలు అశోక్, బాలయ్య పోలీసులతో కలిసి పాల్గొన్నారు.

