నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్: 13 (షేక్ గౌస్)
రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెంచాలని ఆదేశాలు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ సాయి చైతన్య ఐపీఎస్ శనివారం నందిపేట పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి, రికార్డులు, కేసుల పురోగతిపై వివరాలు తీసుకున్నారు. నందిపేట, డొంకేశ్వర్ మండలాల్లో పోలీసు సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కమిషనర్ సూచించారు. మండలాల్లో ఉన్న రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, కమ్యూనల్ సీటర్ల కదలికలపై గట్టి నిఘా పెట్టాలని ఎస్ ఎచ్ ఓ చిరంజీవి ని ఆదేశించారు. ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసుల పాత్ర కీలకమని, ప్రతి ఘటనపై స్పందన వేగంగా ఉండాలన్నారు.నేరాల నివారణకు అన్ని స్థాయిల పోలీస్ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలన్నారు.