జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవబోతుంది–రూరల్ ఎమ్మెల్యే  భూపతిరెడ్డి.

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ దినపత్రిక అక్టోబర్ 27 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజ్ , పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్న సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ..జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పట్ల ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నివసిస్తున్న సెటిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నారని పేర్కొన్నారు.నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు ప్రతి ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని, ప్రజలు ఉత్సాహంగా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారని తెలిపారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహా దారులు నరేందర్ రెడ్డి , మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తాహెర్ బిన్ హందాన్, ఫెరోజ్ ఖన్ ,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర నాయకులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment