నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 8.
ఆర్మూర్ పట్టణంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి అల్పోర్స్ నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ఆర్మూర్ ఇన్‌చార్జ్ వినయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తాను పోటీచేస్తున్నానని, విద్యావంతుల హక్కులను కాపాడేందుకు, నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.విద్య, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని, కాంగ్రెస్ అభ్యర్థిగా తాను గెలిస్తే యువతకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తానని, పట్టభద్రులు తమ మద్దతు తెలియజేసి తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్మూర్ పట్టణంలో జరిగిన ఈ ర్యాలీకి కాంగ్రెస్ నేతలు, విద్యార్థులు, పట్టభద్రులు, స్థానిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని పని చేస్తుందన్న విశ్వాసంతో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని గెలిపించాలని ఆర్మూర్ ఇన్‌చార్జ్ వినయ్ రెడ్డి పిలుపునిచ్చారు.