నందిపేట్ జై భారత్ జూన్ 13: ( షేక్ గౌస్) నందిపేట్ మండల తహసీల్దార్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సంతోష్‌ను శుక్రవారం మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆయనకు ఘనంగా సన్మానం చేశారు.ప్రభుత్వ పతకాలు ప్రజలకు సమయానుకూలంగా చేర్చడంలో తహసీల్దార్ పాత్ర అత్యంత కీలకమని, నూతన తహసీల్దార్ తన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో నిర్వహించి అందరికీ ఆదర్శంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మాహిపాల్, బజార్ కొత్తూరు మాజీ ఉపసర్పంచ్ ముత్యం, నాయకులు సయ్యద్ జమీల్, ఇసుబ్, లక్ష్మీ నారాయణ, గుండప్పశంకర్ తదితరులు పాల్గొన్నారు.