కోళ్ల ఫారం పై సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు .విద్యార్థులను రోగాల బారినుండి కాపాడండి మహా ప్రభో ! AIPSU

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 12.

బాన్సువాడ పట్టణంలోని S.R.N.K డిగ్రీ కాలేజ్ మరియు నర్సింగ్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి కోళ్ల ఫారం పై AIPSU విద్యార్థి సంఘ నాయకులు బాన్సువాడ సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐపీఎస్యు నాయకులు మాట్లాడుతూ సాయికుమార్… రహదారి పక్కనే ఉన్నటువంటి కోళ్ల ఫారం నుండి దుర్వాసన రావడంతో స్థానిక డిగ్రీ కళాశాల విద్యార్థులకు, ప్రజానీకానికి, వాహనదారులకు ఆ దుర్వాసన వల్ల రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి, అట్టి కోళ్ల ఫారం నుండి వెలువడే దుర్వాసన వాళ్ల అనారోగ్యాల పాలు అవుతున్న ప్రజల ప్రాణాలను కాపాడాలని, అలాగే కోళ్ల ఫారం నిర్వాకుడిపై తగు చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ గారికి కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్, వినోద్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!