నిజామాబాద్, 1 August
లోక్ షాహీర్ అన్న బాహుసాటే 101వ జయంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్ రావు, అన్న బాహుసాటే జీవితాన్ని, ఆయన రచనలను కొనియాడారు. పేద ప్రజల కోసం ఆయన చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు.
లోక్ షాహీర్ అన్న బాహుసాటే 101వ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలో గల అన్న బాహుసాటే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గౌరవ మాజీ ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్ రావు మాట్లాడుతూ, ఈ భూమండలం శేషనాగుని తలపై కాకుండా కష్టపడి పని చేసే శ్రామికుల అరచేతుల పైన ఉందని చెప్పిన గొప్ప సంఘసంస్కర్త అన్న బాహుసాటే అని కొనియాడారు. ఆయన జీవిత కాలం మొత్తం తన రచనలు, పాటలతో పేద ప్రజల కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి అని అన్నారు.
ఆయన రచనలు, ఆశయాలను తెలంగాణలోని ప్రతి ఇంటికి తీసుకెళ్తామని, అందులో భాగంగానే నిజామాబాద్ నగరంలో ఏప్రిల్ నెలలో అన్న బాహుసాటే విగ్రహావిష్కరణ జరుపుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ JAC జిల్లా అధ్యక్షులు బరికుంట శ్రీనివాస్ మాదిగ, అన్న బాహుసాటే సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్ గాక్వాడ్, కేశవ్ గాయక్వాడ్, గణేష్ సాయి కాంబ్లె, మరాఠ సమాజ్ నాయకులు దిగంబర్, భక్తవత్సలం ఢిల్లీ, మాదిగ JAC నాయకులు మోతె భూమన్న, పిల్లి విజయ్ కుమార్, DSP నాయకులు ప్రేమ్ కుమార్, రమేష్, మహేష్, MEF నాయకులు రేణిగుంట నాంపల్లి, మారుతి, TMRPS నాయకులు గుండారం మోహన్, సల్లూరి శ్రీనివాస్, రాములు తదితరులు పాల్గొన్నారు.










