నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18.
నిజామాబాద్ నగరంలోని హమాల్ వాడి ప్రాంతంలో బీజేపీ కార్పొరేటర్ స్రవంతి రెడ్డిని శుక్రవారం ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్త సమక్షంలో స్థానికులు తీవ్ర ఆగ్రహంతో నిలదీశారు.కాలనీలో సిసి రోడ్లు, డ్రైనేజీ పనుల భూమి పూజ కార్యక్రమానికి ఏం ఎల్ ఏ హాజరైన సందర్భంలో ప్రజలు తమ సమస్యలను నిర్లక్ష్యం చేశారంటూ కార్పొరేటర్‌పై ఆవేదన వ్యక్తం చేశారు.
43వ డివిజన్ పరిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్రవంతి రెడ్డి గెలిచిన నాటి నుండి ఒక్కసారి కూడా ప్రాంతానికి రాలేదని, ప్రజల సమస్యలను పట్టించుకోలేదని కాలనీవాసులు ఆరోపించారు. స్రవంతి రెడ్డి వారిని శాంతపరిచే ప్రయత్నం చేసినా, ప్రజలు వినిపించుకోలేదు.ఈ ఘటన స్థానిక రాజకీయాల్లో సంచలనంగా మారింది. నాయకులు ప్రజల సమస్యలను పట్టించుకోకపోతే, నిరసనలతో విరుచుకుపడతారని నాయకులకు అర్ధం కావాలని ప్రజలు తెలిపారు.