నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ ఫిబ్రవరి 6.
బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో డోంకేశ్వర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పి సి సి అధ్యక్షుడు మహేశ్ గౌడ్ చిత్రపటాలకు గురువారం పాలాభిషేకం నిర్వహించారు.ఈ సందర్భంగా బీసీ సెల్ అధ్యక్షుడు గణేశ్ గౌడ్ మాట్లాడుతూ, ఎన్నికల హామీలను వరుసగా నెరవేర్చుతున్న సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం రాష్ట్రంలోని బీసీ వర్గాలకు చారిత్రక విజయం అని గౌడ సంఘం గౌరవ అధ్యక్షుడు దశ గౌడ్ పేర్కొన్నారు.అలాగే, రైతులకు రైతు భరోసా పథకం కింద నిధులను వారి ఖాతాల్లో జమ చేయడం, సీఎం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడాన్ని సూచిస్తుందని కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు భూమేశ్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు ప్రజా సంక్షేమానికి దోహదపడుతుండటంతో పాటు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పలువురు మాజీ సర్పంచ్ హరిదాస్, బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.