నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 28.
నాలుగేళ్ల చిన్నారి మట్ట ధనశ్రీ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఏడు ఫీట్ల లోతుగా ఉన్నా డ్రైనేజీలో పడి మృతి చెందింది. ఆర్మూర్ పట్టణం 35వ వార్డు రామ్ నగర్ కాలనీలో ఇ సంఘటన చోటుచేసుకుంది. మట్ట ధనశ్రీ డ్రైనేజీలో పడిన విషయం తెలియక కుటుంంబ సభ్యులు, స్థానికులు చిన్నారి కోసం గాలింపు చేపట్టగా.చివరిగా డ్రైనేజీలో శవమై కనిపించింది. లోతైన డ్రైనేజీ సుమారు కొన్ని నెలలుగా పరిశుభ్రం చేపట్టాక ఇలా తయారైందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్నా మున్సిపల్ డి ఈ భూమేశ్వర్ ని రామ్ నగర్ కాలనీవాసులు నిలదీసి మున్సిపల్ కమిషనర్ రాజు వచ్చేదాకా ఊరుకునేది లేదని డిఇతో వాదించారు. మున్సిపల్ కమిషనర్ రాజు ఆర్మూర్ పట్టణానికి వచ్చినప్పటి నుంచి ఏ పనులు కూడా సక్రమంగా సమయానికి అవుతలేవని స్థానికులు వాపోతున్నారు.