జగిత్యాల జిల్లా ప్రతినిధి జై భారత్ న్యూస్ నవంబర్ 8 .
మెట్ పల్లి పట్టణంలో చైన్స్ స్నాచర్స్ రెచ్చి పోయారు. 12వ వార్డులో నివసిస్తున్న కందనవేణి అనే మహిళ ఆరుబయట తన కూతురికి అన్నం తినిపిస్తున్న సమయంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనం పై వచ్చి మహిళపై దాడి చేసేసరికి, ఆమె అరవడంతో, ఆమెను కిందకు తోసి, మెడలోని మూడున్నర తులాల పుస్తెలతాడు, అరతులం నల్లపూసల గొలుసు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న సిఐ నిరంజన్ రెడ్డి పోలీసు బలగాలతో ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఐ నిరంజన్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు త్వరలోనే దొంగలను కటకటాల పాలు చేసి న్యాయం చేస్తానని బాధితులకు హామీ ఇచ్చారు.
మెట్ పల్లి పట్టణం12వ వార్డులో గొలుసు చోరీ
Published On: November 8, 2024 11:05 am
