నిర్మల్ జై భారత్ జూన్:2 (నాని భోజన్న)తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్మల్ జిల్లా కన్వీనర్ మరియు ప్రెసిడెంట్ సయ్యద్ హైదర్ ముందుగా తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ ప్రత్యేకమైన రోజున, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులను, ఉద్యమకారులను స్మరించుకున్నారు. వారి త్యాగాల ఫలితంగానే మనకు స్వరాష్ట్రం సిద్ధించిందని గుర్తుచేసారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు పలు విషయాలను ప్రస్తావించారు. మన రాష్ట్రం సాధించిన ప్రగతిని, ఎదుర్కొంటున్న సవాళ్లను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పదేళ్లలో, ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని అయితే, ఇంకా అనేక సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు, నిరుద్యోగం, పేదరికం, రైతుల కష్టాలు, విద్య, వైద్యం వంటి రంగాలలో మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని, తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చడానికి, మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దామని, ఈ సందర్భంగా, తెలంగాణ ప్రజలందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల సహాయ సంఘం జిల్లా చైర్మన్ బి.శ్రీనివాస్, సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా అధ్యక్షులు సీ.హెచ్.వినోద్, వైస్ ప్రెసిడెంట్ సోఫి, వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్దుల్ సాధిక్,సాజిద్, రాజు, మిగితా సభ్యులు, పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగిందన్నారు.