జై భారత్ దినపత్రిక బోధన్ ఫిబ్రవరి 05 : (నవీన్ కుమార్) బోధన్ మండలం ఆమ్లాపూర్ శివారులో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 7 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 8 సెల్ఫోన్లు, 4 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు. అరెస్ట్ చేసిన నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులతో కలిసి బోధన్ రూరల్ ఎస్సైకి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బోధన్ లో పేకాట స్థావరంపై సిసిఎస్ పోలీసుల దాడులు
Published On: February 5, 2026 1:07 am









