అంబేద్కర్ ను నిండు పార్లమెంట్లో అవహేళన చేస్తూ అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మ దహనం.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ డిసెంబర్ 30.

వెంటనే అమిత్ షాను కేంద్రమంత్రి నుండి బర్తరఫ్ చేయాలి.

సీపీఐ ఎం.ఎల్ ప్రజాపంథా ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి.కిషన్.

ఆర్మూర్ పట్టణ కేంద్రంలో సిపిఐ ఎంఎల్ ప్రజా పంతం మాస్లైట్ ఆర్మూర్ సంయుక్త మండలాల కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ను నిండు పార్లమెంట్ సభలో అవహేళన చేస్తూ ఆహ్వానిస్తూ మాట్లాడిన కేంద్రమంత్రి అని అంబేద్కర్ చౌరస్తాలో అందించిన దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఆర్మూర్ సంయుక్త మండలాల కార్యదర్శి బి కిషన్ సహాయ కార్యదర్శి ఎం నరేందర్ లు.మాట్లాడుతూ శీతకాల పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా మాట్లాడుతూ అంబేద్కర్ అవమానించి విధంగా అంబేద్కర్ అంటూ ఎంతసేపు జపం చేస్తారు మీరు రామ నామాన్ని స్మరించుకుంటే పుణ్యం జరుగుతుందంటూ సాక్షాత్తు పార్లమెంటులో అంబేద్కర్ని అవహేళన చేస్తూ మాట్లాడడం జరిగిందని ఆయన అన్నారు. బిజెపి నేతలు కేవలం రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా సనాతన ధర్మాన్ని తీసుకురావడానికి ఇటువంటి కుట్రలు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి ఆర్ఎస్ఎస్ సనాతన ధర్మాన్ని ప్రవేశపెట్టడం కోసం ప్రయత్నాలు మోడీ ప్రభుత్వం చేస్తుందని అయన అన్నారు అమిత్ షా వైయస్ అమ్మ దేశంలో పార్లమెంటుకు ఏ పద్ధతిలో ఎన్నిక కావడం జరిగిందని అయన ప్రశ్నించారు.?? బిజెపి మతోన్మాద ఆశిస్తూ విధానాలను ఇకనైనా మానుకోవాలని రాజ్యాంగాన్ని అవమానించే విధానాన్ని మానుకోకుంటే ఈ సమాజం సరైన సమాధానం బిజెపి ప్రభుత్వానికి చెబుతుందని ఆయన అన్నారు. తక్షణమే రాజ్యాంగాన్ని అంబేద్కర్ను అవహేళన చేస్తూ అవమానించిన అమిత్ షాను కేంద్ర క్యాబినెట్ నుండి బర్తరపు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో బిజెపి ప్రభుత్వానికి అన్ని వర్గాల వారు బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ సంయుక్త మండలాల నాయకులు అరవింద , పద్మ నిఖిల్ సిద్ధార్థ వినోద బాలు, నిఖిల్, నజీర్, రవి, నరేష్, బీరుగొండ, రాజేష్, ధనుష్, మమత,తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!