నవీపేట్ శివారులో మహిళ దారుణ హత్య.

వివస్త్రను చేసి, తల, కుడి చేతి వేళ్ళు నరికి చంపేశారు

ఘటనాస్థలం పరిశీలించిన సీపీ సాయి చైతన్య.

నెల రోజుల వ్యవధిలో రెండో ఘటన.

ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక దినపత్రిక నవంబర్ : 01 నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం లో శనివారం ఉదయం వెలుగు చూసిన మహిళ హత్య కలకలం రేపింది. మండలంలోని శివారు బాసర ప్రధాన రహదారి ప్రక్కన తల మొండెంవేరు చేసి కుడి చేతి వేళ్ళు నరికి వివస్త్రను చేసిన గుర్తు తెలియని మహిళ మృతదేహం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. స్థానికుల సమాచారం మేరకు నవీపేట్ ఎస్సై తిరుపతి ఘటన చేరుకొని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో నిజామాబాద్ నార్త్ రూరల్ సి.ఐ.నిజామాబాద్ సీపీ సాయి చైతన్య ఘటన స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం తో ఆధారాలు సేకరించారు. పోలీసుల సమాచారం మేరకు గుర్తు తెలియని 25 నుండి 40 ఏళ్ల వయసు కలిగిన మహిళ ను వేరే ప్రాంతంలో హత్య చేసి మిట్టాపూర్ శివారు లో పడవేశారని,పాత కక్షలు, అక్రమ సంబంధం తోనే హత్య జరగవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.కేసు నమోదు చేసుకొని పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ హాస్పిటల్ కు తరలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, చుట్టపక్కల గ్రామాల్లో ఎవరైనా మిస్సింగ్ అయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సి.ఐ.శ్రీనివాస్ కోరారు. ఇదిలాగా ఉండగా నెల రోజుల వ్యవధిలో నేరెండో మహిళ హత్యకు గురి కావడం స్థానికంగా భయాందోళనలు కల్పిస్తుంది. తాజాగా నవీపేట్ లో జరిగిన మహిళ హత్య కేసులో మహిళను అత్యాచారం చేసి హత్యచేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవీపేట్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చర్యలను ముమ్మరం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment