రేవంత్ రెడ్డి నిజమైన కొరివి దెయ్యం… కేసీఆర్‌ను తిట్టి తెలంగాణ ద్రోహిగా మిగులవద్దు
హైదరాబాద్ జై భారత్ జూన్ : 6 తెలంగాణ ఉద్యమానికి అంకితమైన బీఆర్ఎస్‌ను ‘దెయ్యాల సమితి’గా అభివర్ణించిన సీఎం రేవంత్ రెడ్డిపై, బీఆర్ఎస్ నాయకుడు, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన రేవంత్ వ్యాఖ్యలను ప్రజల బుద్ధిని అవమానపరిచే స్థాయిలో ఉన్నాయని ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ అంటే బలహీన వర్గాల బలం, రైతుల బంగారు భవిష్యత్తు. కాంగ్రెస్ అంటే ప్రజలను హింసించే భూతాల దేవి!” అంటూ ఆయన విమర్శించారు.కేసీఆర్ తెలంగాణ సూర్యుడు… బీఆర్ఎస్ ఉద్యమ భాస్వరం. రేవంత్‌నే అసలైన కొరివి దెయ్యం!” అంటూ బద్ధ శైలిలో ఫైర్ అయ్యారు.జీవన్ రెడ్డి హెచ్చరించారు కేసీఆర్‌తో గొడవకు వస్తే నీ రాజకీయ భవితవ్యాన్ని నీ గురువు దగ్గర కూర్చొని అడిగి తెలుసుకో! నోరు అదుపులో పెట్టుకో, తిట్లతో తెలంగాణలో తలదించుకునే పరిస్థితి వస్తుంది.రేవంత్ పాలన అంతా దేవుళ్లపై ఓట్లు అడిగే రాజకీయాలు, కేసీఆర్‌పై తిట్లు వేసే విమర్శలే. ప్రజలు చూసుకుంటున్నారు… సమయానికి తీర్పు ఇస్తారు” అని హెచ్చరించారు.ఇంతటితో ఆగలేదు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనే ప్రజలు దేశం పొలిమేరలు దాటి కొడుతున్నారు. అయినా డిల్లీలో రాహుల్, గల్లీలో రేవంత్‌కు బుద్ధి రావడం లేదు” అంటూ విరుచుకుపడ్డారు.