నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:20 ( షేక్ గౌస్)
నందిపేట మండల కేంద్రంలోని శుఖిభవ హాస్పిటల్‌లో ఆదివారం ఇండియన్ రెడ్ క్రాస్స్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభమైంది. ఈ శిబిరానికి యువత స్వచ్ఛందంగా హాజరై రక్తదానం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు యువకులు రక్తదానం చేయగా, శిబిరం సాయంత్రం వరకు కొనసాగనున్నందున ప్రజలు ముందుకు వచ్చి పాల్గొనాలని నిర్వాహకులు కోరుతున్నారు. ప్రాణాలను కాపాడే ఈ సేవలో యువత విశేషంగా పాల్గొనడం హర్షణీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న షేక్ రియాజ్‌ను సమాజ సేవకులు సిలిండర్ లింగం, కాంగ్రెస్ నాయకుడు మన్నే సాగర్ తదితరులు అభినందించారు.