నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్
- వర్తమాన బహుజన శ్రామిక రాజకీయ అవగాహనతో రచయిత దండి వెంకట్ ఇటీవల రాసిన “బహుజన వర్తమానం” పుస్తకం ముంబై నుంచి విచ్చేసిన ఆలిండియా అంబేడ్కర్ సంఘం నాయకులైన మూలనివాసి మాలజీ ఆయన టీంకు అందజేశారు. స్పష్టమైన మార్క్సిజం అంబేడ్కరిజం సైద్ధాంతిక పునాదిగా రాజకీయ అవగాహనతో సామాజిక విప్లవకవి రచయితగా తెలంగాణలో దండి వెంకట్ తనదైన ముద్ర వేసుకున్న విషయం తెలిసిందే. ప్రజల ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలను పలు సందర్భాలలో సోషల్ మీడియాలో రాసిన వ్యాసాల సంకలనమే ఈ పుస్తకమని మూలనివాసి ఈ సందర్భంగా పేర్కొన్నారు. బహుజన లెఫ్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ రాసిన పుస్తకాన్ని శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా ఆఫీస్లో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మాలజీ మాట్లాడుతూ వెంకట్ ఒక అత్యంత శ్రమ దోపిడికి గురిచేయబడ్డా సాధారణ బిసి (ఎ) వడ్డెర కుటుంబంలో జన్మించిన ఆయన గత 37ఏండ్లుగా కమ్యూనిస్టు ఉద్యమం ద్వారా మార్క్సిజాన్ని, అంబేడ్కరిజాన్ని అధ్యయనం చేయడం వల్ల స్పష్టమైన బహుజన శ్రామిక దృక్పథం కల్గిన రియల్ కమ్యూనిస్టుగా ఎదిగారని కొనియాడారు. మరోవైపు కులవర్గ సైద్ధాంతిక అవగాహనకు లోబడి బహుజనుల స్థితిగతులను వస్తువుగా చేసుకోని ఇప్పటి వరకు అక్షర దండి యాత్ర, ధిక్కారం, అసుర పునర్నవం లాంటి కవితా సంకలనాలు ఉన్నాయన్నారు. అయితే నిరంతరం స్టడి చేస్తూ కులవర్గ దోపిడి వ్యవస్థ మార్పుకు మరిన్ని రచనలు చేయాలని మాలజీ అభిలాషించారు. ఈ భేటీలో అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు ఇత్వార్ పేట్ లింగన్న, కేశ్పల్లి రవి, విజయ్ సాలుంకే, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.