జై భారత్ దినపత్రిక నిజామాబాద్ జనవరి 19 : ఎర్రైవ్ అలైవ్ కార్యక్రమం లొ భాగంగా దూదిగాం దగ్గర ఎన్ హెచ్ 44 రోడ్డు వద్ద బ్లాక్ స్పాట్ అయిన కోతి దేవుని వద్ద మెండోరా SI సుహాసిని ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, రోడ్డు భద్రత గురించి అవగాహన కల్పించడం జరిగింది. రోడ్డు ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన బాధితులతో మాట్లాడడం జరిగింది. పోచంపాడు కి చెందిన మహమ్మద్ జహంగీర్ రోడ్డు ప్రమాదంలో తన కొడుకును కోల్పోయారని ,గత 3 నెలల క్రితం పోచంపడులో తన కోడుకు హెల్మెట్ ధరించకుండా బైక్ రైడ్ చేస్తూ అదుపు తప్పి డివైడర్ ను గుద్దుకోగా అక్కడిక్కడే చనిపోయాడని ఆయన బాధపడ్డారు. హెల్మెట్ ధరించక పోవడం వల్లనే తన కొడుకును కోల్పోయారని బాధపడ్డారు. ఆర్మూర్ సీఐ గారు ప్రతి ఒక్కరు వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని తమ ప్రాణాలను కాపాడుకోవాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు, వాహనదారులు ఎక్కువ సంఖ్యలో హాజరు కావడం జరిగింది.
మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రైవ్ అలైవ్ కార్యక్రమం.
Published On: January 19, 2026 2:43 pm











