నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ న్యూస్ జనవరి 18.
అక్రమ సంబంధం, మద్యం సేవనం ప్రాణాన్ని హరించింది
నిజామాబాద్ జిల్లా, మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామంలో కాంపౌండర్ దిలీప్ శర్మ దారుణ హత్యకు గురైన కేసులో ఆర్మూర్ రూరల్ సర్కిల్ సీఐ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్కొండ, మెండోరా, ముప్కల్ పోలీసుల బృందం 24 గంటల వ్యవధిలో నిందితులను అరెస్టు చేసింది.ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి గురువారం ప్రెస్‌మీట్‌లో కేసు వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, మృతుడి భార్య సాగరిక ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, బుస్సాపూర్ గ్రామానికి చెందిన శ్రీకర్ మరియు కోడిచెర్ల గ్రామానికి చెందిన అక్షయను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అక్రమ సంబంధం వల్లే హత్య దిలీప్ శర్మ, శ్రీకర్, అక్షయ మధ్య ఉన్న అక్రమ సంబంధాలు, మద్యం సేవనల కారణంగా జరిగిన గొడవలు ఈ హత్యకు దారితీసాయి. మృతుడు దిలీప్ శర్మ మరియు శ్రీకర్ మద్యం సేవిస్తుండగా, అక్షయ ప్రస్తావన రావడం తో గొడవ మొదలైంది. ఈ గొడవలో శ్రీకర్, అక్షయ కలిసి దిలీప్ శర్మను హత్య చేశారు.దిలీప్ శర్మ పవన్ క్లినిక్‌లో కాంపౌండర్‌గా పని చేస్తూ, క్లినిక్ వెనుక గదిలో తన కుటుంబంతో నివసిస్తున్నాడు. సోమవారం, తన భార్య, పిల్లలు బడాపూర్ గ్రామానికి వెళ్ళడంతో స్నేహితుడు శ్రీకర్‌తో కలిసి మద్యం త్రాగాడు. మద్యం మైకంలో అక్షయ ప్రస్తావన రావడం తో గొడవ చోటు చేసుకుంది. అనంతరం అక్షయ అక్కడకు చేరుకోవడం వల్ల ఈ హత్య జరిగింది.పోలీసుల చర్యలు ఘటనా స్థలానికి వెంటనే చేరుకున్న పోలీసులు, మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభించారు. ఎస్సై నారాయణ, ఎస్సై నరేశ్, ఎస్సై జినీకాంత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, హత్యకు ఉపయోగించిన సిమెంట్ బ్లాకుల ఆధారంగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చి తమ దైన శైలిలో విచారణ చేపట్టారు.సీఐ అభినందనఈ కేసును 24 గంటలలో ఛేదించిన బాల్కొండ, మెండోరా, ముప్కల్ ఎస్సైలు నారాయణ, నరేశ్, జినీకాంత్ మరియు పోలీస్ సిబ్బందిని సీఐ శ్రీధర్ రెడ్డి ప్రశంసించారు.