హైదరాబాద్ జై భారత్ ఆగస్టు 20 : హైదరాబాద్ గాంధీ భవన్‌లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 81వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ – రాజీవ్ గాంధీ ఐటీ రంగానికి పునాదులు వేసి యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గొప్ప నాయకుడు అని అన్నారు.ఈ కార్యక్రమంలో నందిపేట్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అర్ముర్ ఇంచార్జి వినయ్ రెడ్డి, మండల అధ్యక్షుడు మహిపాల్ మార్కుట్ కమిటీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు, పిప్పర సాయారెడ్డి, మీసాల సుదర్శన్, మోహన్ రావు, ఇసుబ్, మెండు శ్రీకాంత్, భట్టు సాయిరాం, సతీష్ తదితరులు హాజరయ్యారు.
రాజీవ్ గాంధీ జయంతి లో పాల్గొన్న అర్ముర్ నియోజక నాయకులు
Published On: August 20, 2025 7:05 pm









