ఆర్మూర్ జై భారత్ జూన్:4 ( షేక్ గౌస్) ఆర్మూర్‌కు చెందిన ప్రముఖ ప్రజాసేవకుడు అబుల్ హసన్ అలియాస్ ఆర్మూర్ గాంధీ కు నిజామాబాద్ లోని ఫూలాంగ్ ప్రాంతంలోని అల్మాస్ గెస్ట్ హౌస్‌లో హెల్ప్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధాప్యాన్ని లెక్క చేయకుండా ప్రజా సంక్షేమం కొరకు కృషి చేస్తుండడం పట్ల ప్రజలు ఆయన ను ఆర్మూర్ గాంధీ గా పిలుస్తారు. కరోనా విపత్తు సమయంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమైనవని వక్తలు అన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు మోహమ్మద్ నదీం అహ్మద్ మాట్లాడుతూ—”ఈ వయస్సులోనూ సామాజిక సేవలో కొనసాగుతున్న అబుల్ హసన్ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. గంగాజమున తేజజీబను పాటిస్తూ మతసామరస్యానికి శ్రమిస్తున్న ఈ సేవా యోధుని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గౌరవించాలి” అని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ జర్నలిస్ట్, ‘ఫిక్రె జమోహూర్’ ఎడిటర్ సయ్యద్ ఉస్మాన్ అలీ మాట్లాడుతూ—”అబుల్ హసన్ నిజంగా ఆర్మూర్ గాంధీ అనే బిరుదుకు అర్హులు. ఆయన నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. ప్రజలలో విశేష గౌరవం పొందారు. అలాంటి వారు సమాజానికి గొప్ప సంపద” అని ప్రశంసించారు.కార్యక్రమంలో సొసైటీకి చెందిన ఇతర సభ్యులు సయ్యద్ నదీం, బాబర్ ఖురేషీ, షాహిద్ ఖురేషీ, అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ గాంధీ అబుల్ హసన్‌కు సత్కారం.
Published On: June 4, 2025 9:16 pm
