నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక డిసెంబర్ 28 : బాసర ఆర్జీయూకేటీ (RGUKT) క్యాంపస్‌లో తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ (TSAS) నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం (డిసెంబర్ 28, 2025) ఉత్సాహంగా జరిగాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.అధ్యక్షుడిగా నవనీత్: అధ్యక్ష పదవికి జరిగిన పోటీలో సామిల నవనీత్ 1385 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఆయనతో పాటు రావుల వినయ్, బాలాజీలు ఈ పదవికి పోటీ పడ్డారు.ఉపాధ్యక్షుడిగా అజ్మల్ ఖాన్, ఉపాధ్యక్ష పదవికి జరిగిన త్రిముఖ పోటీలో మహ్మద్ అజ్మల్ ఖాన్ 1124 ఓట్లతో విజేతగా నిలిచారు. ఈ పదవికి నలం హరిక్షిత్, కోమల్ కుమారి కూడా పోటీ చేశారు.ఓటింగ్ వివరాలు: ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆన్‌లైన్ ద్వారా పోలింగ్ నిర్వహించారు. మొత్తం 2398 మంది విద్యార్థులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 1180 మంది విద్యార్థులు,1218 మంది విద్యార్థినులు ఉన్నారు.నూతనంగా ఎన్నికైన ఈ కార్యవర్గం విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, క్యాంపస్ అభివృద్ధి కోసం కృషి చేయనుంది.
ఆర్జీయూకేటీ టీఎస్ఏఎస్ ఉపాధ్యక్షుడిగా అజ్మల్ ఖాన్.
Published On: December 29, 2025 11:32 am











