నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చి:18 ( షేక్ గౌస్)
నందిపేట మండలంలో నిర్మాణంలో ఉన్న ఎస్‌ఎస్‌ఆర్ ప్రైవేట్ పాఠశాలకు అనుమతి లేకుండానే అడ్మిషన్లు ప్రారంభించారని విద్యార్థి జన సమితి నాయకులు ఆరోపించారు. ఈ విషయంలో తక్షణమే చర్యలు తీసుకుని, పాఠశాల అనుమతులను రద్దు చేయాలని మండల ఎంఈఓ, ఎమ్మార్వోలకు వినతిపత్రం అందజేశారు.విద్యార్థి జన సమితి రాష్ట్ర కార్యదర్శి తులసి రామ్ మాట్లాడుతూ, పూర్తి కాకున్నా భవనానికి అనుమతులు ఇవ్వడం విద్యా నిబంధనలకు విరుద్ధమని, తగిన అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేపట్టడం విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారుతుందన్నారు. వెంటనే ఈ స్కూల్‌కి ఇచ్చిన అనుమతులను రద్దు చేసి, విద్యార్థుల అడ్మిషన్‌లను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు రణధీర్, చరణ్, భాను ప్రకాష్, రవి తదితరులు పాల్గొన్నారు.