ఎడపల్లి మండలం (భారత్ స్పెక్ట్రమ్) జూలై 12
ఎడపల్లి మండలం, జానకంపేట గ్రామ శివారులోని అశోక్ సాగర్ చెరువు కట్ట సమీపంలో బోధన్ - నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
ఎడపల్లి మండలం, జానకంపేట గ్రామ శివారులోని అశోక్ సాగర్ చెరువు కట్ట సమీపంలో బోధన్ - నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఆదివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై 6వ టౌన్ ఎస్ఐ సందీప్ వివరాలు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. జాన్కంపేట్ గ్రామానికి చెందిన మార అవిక్షిత్ (29) తన తల్లి మార కమల (57)తో కలిసి పల్సర్ మోటార్ సైకిల్ పై జాన్కంపేట్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్నారు. మార్గమధ్యలో అశోక్ సాగర్ చెరువు కట్ట వద్దకు చేరుకోగానే, వారి వెనకాలే అతివేగంగా వస్తున్న లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో బైక్ హ్యాండిల్‌ను ఢీకొట్టింది.
దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కింద పడిపోగా, లారీ చక్రాలు మహిళపై నుంచి వెళ్లడంతో ఆమె తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడుపుతున్న మృతురాలి కుమారుడు అవిక్షిత్కు స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ఎడపల్లి 108 ఆంబులెన్స్ ద్వారా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
సంఘటనపై మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు.












