కామారెడ్డి జిల్లా మండలం సమీపంలోని ఓ ఫార్మా కంపెనీలో గురువారం రాత్రి రియాక్టర్ పేలిన ఘటనలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు.
కామారెడ్డి జిల్లా మండలం సమీపంలోని ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన ఘటన కలకలం రేపింది. గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. రియాక్టర్ పేలడంతో కంపెనీలో పనిచేస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఫ్యాక్టరీ అధికారులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు కాగా, మరో ఇద్దరు స్థానికులు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

