ఆర్మూర్ జై భారత్ జూన్ 23: కుట్రపూరితంగా కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు . కొనసాగుతున్న కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపుల పర్వం అసలు రేవంతే అంతులేని అవినీతి పరుడు కాంగ్రెస్ అంటేనే ఫాదర్ ఆఫ్ కరప్షన్ అవినీతి, అరాచకా లు, అబద్దాలతో కట్టిన మూడు రంగుల టవర్ ఏఐసీసీ అంటే అల్ ఇండియా “కరప్షన్” సెంటర్ పీసీసీ అంటే ప్రదేశ్ కరప్షన్ సెంటర్ కాంగ్రెస్ చరిత్రంతా ఏ టూ జడ్ స్కామ్ లే నేషనల్ హెరాల్డ్ పేరుతోబుక్కిందెంత,హైడ్రా పేరుతో మెక్కిందెంత? స్కామ్ లు, పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే కేటీఆర్ కునోటీసులు రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ ను ఎండగడతాం బీఆర్ఎస్ నేత,మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వం కాసుల కోసం జేసీబీని, ప్రత్యర్థులను అణచివేసే కేసుల కోసం ఏసీబీని ప్రయోగిస్తోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు,ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు.కుట్రపూరితంగా కేటీఆర్ కు ఏసీబీ ద్వారా నోటీసులు జారీ చేయించి కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతోందని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మండిపడ్డారు.కాంగ్రెస్ సర్కారు కక్ష సాధింపుల పర్వం కొనసాగుతున్నదని ఆయన ధ్వజ మెత్తుతూ అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే అంతులేని అవినీతి పరుడని ఆరోపించారు. ‘కాంగ్రెస్ అంటేనే ఫాదర్ ఆఫ్ కరప్షన్.అవినీతి, అరాచకా లు, అబద్దాలతో కట్టిన మూడు రంగుల టవర్.ఏఐసీసీ అంటే అల్ ఇండియా “కరప్షన్” సెంటర్.పీసీసీ అంటే ప్రదేశ్ కరప్షన్” సెంటర్.కాంగ్రెస్ చరిత్రంతా ఏ టూ జడ్ స్కామ్ లే.నేషనల్ హెరాల్డ్ పేరుతో రేవంత్ రెడ్డి బుక్కిందెంత?.హైడ్రా పేరుతో మెక్కిందెంత? అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఎలాంటి అవినీతి జరగని కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ వేశారన్నారు. కేసీఆర్ ను విచారణ పేరుతో వేధిస్తున్నారని, ఈ-ఫార్ములా కారు రేసింగ్ లోనూ తప్పు జరిగినట్టు ఆధారాలు లేకున్నా ప్రజల పక్షాన పోరాడకుండా అడ్డుకోవాలని దుష్టతలంపుతో ఏసీబీ చేత కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆయన తెలిపారు. స్కామ్ లు, పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకే కేటీఆర్ కునోటీసులు జారీ చేశారని ఆయన విమ ర్శించారు. రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ ను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని జీవన్ రెడ్డి హెచ్చరించారు.
కాసుల కోసం జేసీబీ–కేసుల కోసం ఏసీబీ
Published On: June 23, 2025 6:03 pm
