మంగల్ పాడ్ గ్రామంలో విషాదం.బోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు.
ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో జై భారత్ దినపత్రిక నవంబర్ 12 : ఎడపల్లి మండలం మంగల్ పాడ్ గ్రామ శివారులోని బోడ గుట్ట సమీపంలో చేపూర్ ప్రతాప్ గౌడ్(30) అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.రెండు రోజుల్లో ప్రతాప్ గౌడ్ కు పెళ్లి జరుగాల్సి ఉంది. ఈ ఘటనతో పెళ్లి జరగాల్సిన కుటుంబంలో పెను విషాదం నింపింది.రెండు రోజుల్లో పెళ్లి కావాల్సిన ప్రతాప్ గౌడ్ ఉరి వేసుకొని ఆత్మహత్య కు పాల్పడంతో గ్రామంలో విశాదచాయాలు అలుము కున్నాయి.పోలీసులు,స్థానికులు తెలిపిన కథనం ప్రకారం..మంగల్ పాడ్ గ్రామానికి చెందిన చేపూర్ ప్రతాప్ గౌడ్ కు పెళ్లి సంబంధం కుదిరింది. ఇంట్లో పెళ్ళికి కావాల్సిన సామాగ్రి సిద్ధం చేసుకున్నారు.మంగళవారం ఇంట్లో పోచమ్మ పండుగ చేసుకోవాలి,బుధవారం ఇంటి ముందు పెళ్లి పందిరి వేయాలి,ఈ నెల 13న గురువా రం ఇంట్లో ప్రతాప్ గౌడ్ కు పెళ్లి జరగాల్సిన ఉందని కుటుంబ తెలిపారు.పెళ్లి శుభా సభ్యులు,స్థానికులు అన్ని సిద్ధం కార్యంకు చేసుకున్నారు.సోమవారం ఉదయం 10 గంటల సమయంలో పొలంకు వెళ్ళొస్తా నని ఇంట్లో చెప్పి ఇంటి నుండి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని,అంతటా వెతికిన ఆచూకీ దొరకలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.దీంతో ఎడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు.మంగళవారం గ్రామానికి చెందిన ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందగా గ్రామశివారులో అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో అదే ప్రాంతంలో గల బోడ గుట్ట ప్రాంతంలో బైక్ కనిపించగా స్థానికులు హుటాహుటిన అటువైపు పరుగులు తీశారు. గుట్టకు వెతుకగా ప్రతాప్ గౌడ్ చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు.పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. మృతుడు సోదరుడు చేపూర్ శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తు న్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సిన ఉందని పోలీసులు తెలిపారు. ప్రతాప్ గౌడ్ మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.









