డిచ్పల్లి జై భారత్ (ఆర్మూరి గంగాధర్) నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి గ్రామానికి చెందిన ఎర్ర ధర్మరాజు అనే వ్యక్తి మంగళవారం ఉదయం చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఉదయం మృతుడి పొలం పక్కన రైతులు గడ్డి కోయడానికి వెళ్తుండగా ఆకస్మికంగా చెట్టుకు ధర్మరాజు అనే వ్యక్తి ఓగులాడం చూసినా గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విషయం తెలిసిన పోలీసు బృందం హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.పోలీసుల కథన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇల్లు నిర్మించుకోలేక మానసిక ఆందోళన చెంది తన పొలంలో వేపచెట్టు కు ఉరివేసుకొని ఆత్మహత్య కు పాల్పడ్డాడు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నరూ
పోస్ట్మాస్టమ్ నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు డిచ్పల్లి ఎస్సై సుహాసిని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య.
Published On: May 27, 2025 12:07 pm
