ఈరోజు బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు గారు పాల్గొన్నారు..బిచ్కుంద మండలంలోని గ్రామాల నాయకులు,కార్యకర్తలు గ్రామ సమస్యల గురించి ఎమ్మెల్యే గారితో చర్చించడం జరిగింది..వీలైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు..నియోజకవర్గంలో రోడ్లు, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం మెరుగుపరచడమే తన ప్రాథమిక లక్ష్యమని అన్నారు..ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మరియు నియోజకవర్గంలో మనం చేపట్టిన అభివృద్ధి పనుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కార్యకర్తలకు సూచించారు..
బిచ్కుంద మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం
Published On: November 16, 2024 5:30 pm
