సూపర్ మార్కెట్లో చోరీకి విఫలయత్నం.

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ దినపత్రిక నవంబర్ 02 : రెంజల్ మండలంసాటాపూర్ గ్రామంలో దొంగల విఫలయత్నం చోటుచేసుకుంది. కందకుర్తి రోడ్లో గల సూపర్ మార్కెట్కు శనివారం రాత్రి దొంగలు గ్యాస్ కట్టర్ సాయంతో షెట్టర్ను కత్తిరించి దొంగతనానికి ప్రయత్నించారు. ఈ సమయంలో లోపలే నిద్రిస్తున్న సూపర్ మార్కెట్ యజమాని, షెట్టర్ పగలగొడుతున్న శబ్దాన్ని గమనించి కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుంచిపారిపోయారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్తో పరిశీలించారు. అలాగే ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను సేకరించి, దొంగల కోసం అన్వేషణ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment