ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే: 4
చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్న స్నేహితులు

25 సంవత్సరాల తర్వాత స్నేహితులు అందరూ కలిసి వారు చదువుకున్న 1999-2000 వ సం. పదవతరగతికి చెందిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకున్నారు. శ్రీ సూర్యోదయ హై స్కూల్ నందిపేట్ ఇన్ని సంవత్సరాల తర్వాత విద్యార్థులు మరియు గురువుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు అంతరాలను మరిచి, ఆంతర్యాలను మరచి 25 సంవత్సరాల తర్వాత ఒక్కటై వారి కుటుంబ సభ్యులతో కలిసి వారి అనుభవాలను, మనోభావాలను ఒకరినొకరు పంచుకుంటూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగా ఈ వేడుకలను నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో శ్రీ నాగారావు సార్ కరస్పాండెంట్ శ్రీ సూర్యోదయ హై స్కూల్ నందిపేట్, పూర్వ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!