నందిపేట్ జై భారత్ జూలై 10: (షేక్ గౌస్) నందిపేట్ మండలం షాపూర్ గ్రామంలో గురువారం జిల్లా న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టపరమైన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు సెషన్స్ జడ్జి భాస్కర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా జడ్జి భాస్కర్ రావు మాట్లాడుతూ, గ్రామాభివృద్ధి కమిటీలు (VDC) చట్టాన్ని చేతిలోకి తీసుకొని కుల బహిష్కరణ, జరిమానాలు విధించే కార్యక్రమాలను చేపడితే, అది చట్ట ఉల్లంఘనగా పరిగణించి కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.పోలీసులు, న్యాయ వ్యవస్థలు ప్రజల హక్కులను కాపాడేందుకే ఉన్నాయని, ఎవరికీ రాజ్యాంగం కల్పించిన హక్కులను భంగపెట్టే అధికారం లేదని స్పష్టం చేశారు. గ్రామ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా కాకుండా, గ్రామాభివృద్ధిలో భాగస్వాములుగా మారాలని పిలుపునిచ్చారు.ఇట్టి కార్యక్రమం లో సీనియర్ న్యాయవాదులు, ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ శ్రీధర్ రెడ్డి, నందిపేట్ ఎస్‌ఐ పాల్గొన్నారు. గ్రామస్తులు పాల్గొన్నారు.
VDCలకు కఠిన హెచ్చరిక చేసిన జిల్లా జడ్జి భాస్కర్ రావు
Published On: July 10, 2025 5:35 pm
