నందిపేట్ జై భారత్ జూన్ 22: (షేక్ గౌస్)
నందిపేట్ మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న 11 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రూ.5.79 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో సుమయ ఫాతిమా, నాయిమ్ బేగం, చేపూర్ సుకన్య, అబ్దుల్ సమద్, షాహీన్ బేగం, వేముల నవదీప్, షేక్ రిజ్వానా, ఒడ్డే లక్ష్మి, అనంత్ సుజాత, అర్సపల్లి శ్రీను, ఎర్రం లసుంబాయి లాంటి 11 మందికి ఆరోగ్య చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు.మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మహిపాల్ మాట్లాడుతూ, “ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు పూర్తిగా వినియోగించుకోవాలి. సహాయం అవసరమైన వారికి అందించే బాధ్యత ప్రతి నాయకుడిపై ఉంది,” అని అన్నారు.ఈ కార్యక్రమంలో దమ్మాయి శ్రీను, జమీల్, నాగరాజ్, హైమద్, అఫ్జల్, కళా భోజన్న తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్య బాధితులకు రూ.5.79 లక్షల సి ఏం రిలీఫ్ చెక్కుల పంపిణీ
Published On: June 22, 2025 1:27 pm
