నందిపేట్ జై భారత్ జూన్ 11: (షేక్ గౌస్) నందిపేట్ మండల బీజేపీ మండల ఉపాధ్యక్షుడిగా గద్దె రవీందర్ నియమితులయ్యారు. ఆయన నియామక పత్రాన్ని మంగళవారం రోజున మండల ఇంచార్జ్ నూతల శ్రీనివాస్ చేతుల మీదుగా స్వీకరించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ, గత ఐదు సంవత్సరాలుగా నందిపేట మండల బీజేపీ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శిగా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లుతూ, పార్టీ బలోపేతానికి కృషి చేశానని తెలిపారు.తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన బీజేపీ నాయకత్వానికి రవీందర్ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ పటేల్, మండల ఇంచార్జ్ నూతల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు పటేల్ రాజు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ నాగ సురేష్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
బీజేపీ మండల ఉపాధ్యక్ష గా గద్దె రవీందర్.
Published On: June 11, 2025 10:59 pm
