బోధన్ జై భారత్ జూన్ 10 : వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపిన సుదర్శన్ రెడ్డి అభిమానులు బోధన్ పట్టణంలోని బీటి నగర్ లో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ జెండాలు పట్టుకుని నిరసనలు తెలియజేశారు. సుదర్శన్ రెడ్డి కి మంత్రి పదవి ఇవ్వకుంటే ట్యాంక్ పైన నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నచ్చ చెప్పడంతో వారు ట్యాంక్ పై నుంచి కిందకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో నవీన్ తలారి, హైమద్, జునేద్, నాసిర్, ఉమేష్, హర్షద్ లు పాల్గొన్నారు.
సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకుంటే చావడానికైనా సిద్ధం
Published On: June 10, 2025 11:12 pm
