ఆర్మూర్ జై భారత్ జూన్ 10: ఆర్మూర్ పట్టణంలో శిథిలావస్థలో ఉన్న భవనాలకు మున్సిపల్ అధికారులు నోటీసులు అందజేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు మంగళవారం మున్సిపల్ కమిషనర్ రాజు 34వ వార్డును సందర్శించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి ఇంటి యజమానులకు నోటీసులు అందజేశారు. రెండురోజుల్లో ఇళ్లను కూల్చివేయాలని వారిని ఆదేశించారు. శిథిల భవనాల్లో నివసించడం ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో టీపీవో ఆంజనేయులు, సిబ్బంది తదితరులున్నారు.
