నందిపేట్ జై భారత్ జూన్:3 (షేక్ గౌస్) కంఠం గ్రామంలో మంగళవరం ఉద్యోగస్తుల సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. పదవీ విరమణ చేసిన దారపు భూమన్న , జంగాం సత్యం లను గ్రామస్థులు, సంఘ సభ్యులు ఘనంగా సన్మానించారు.అలాగే, ఇటీవల వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించిన గ్రామానికి చెందిన ఐదుగురు యువతను అభినందించి సన్మానించారు. తల్లిదండ్రుల కష్టాలను గుర్తు చేసుకుంటూ, యువత తమ విజయాలను గ్రామ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సంఘం నాయకులు కోరారు.పదవ తరగతి పరీక్షలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు శాలువా కప్పి, ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు పెంట జలందర్ మాట్లాడుతూ “ఉద్యోగాల్లోనూ, చదువుల్లోనూ కంఠం గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. భవిష్యత్తులో మరింత అభివృద్ధి కోసం ఉద్యోగస్తుల సంఘం తరఫున అన్ని రకాల సహకారాన్ని అందిస్తాం” అని వ్యాఖ్యానించారు.
