బోధన్ జై భారత్ మే:31 నేడు బోధన్ డివిజన్ పరిధిలోని సాఠాపూర్ మరియు బోర్గామ్ గ్రామ సరిహద్దులో ఉన్నటువంటి పశువుల కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరిగింది.ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పశువుల కొనుగోలుకు సంబంధించి నటువంటి రికార్డులను పూర్తిగా తనిఖీలు నిర్వహించారు ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావివ్వకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.ఈ సందర్భంగా బోధన్ ఏసీపి శ్రీనివాస్, రెంజల్ ఎస్ఐ శ్రీ చంద్రమోహన్, జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ రోహిత్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.