నిజామాబాద్ జై భారత్ మే:30 సెకండరి స్కూల్ సర్టిఫికెట్ అడ్వాన్స్ సప్లమెంటరి పరీక్ష జూన్ – 2025 నిర్వహణ కోసం నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో తేది : 3-06-2025 నుండి తేది : 13-06-2025 వరకు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:50 గంటల వరకు పరీక్షా కేంద్రాలో వద్ద ఎలాంటి అవంచానియా సంఘటనలు జరగకుండా ముందస్తుగా నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, IPS నిషేధిత ఆదేశాలు జారీ చేయడం జరిగింది.కావున నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు గా నిరోధించాలనే ఉద్దేశ్యంతో నిజామాబాదు పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, IPS అండర్ సెక్షన్ 163 BNSS అమలులో ఉంటుంది అని తెలియజెసారు.అండర్ సెక్షన్ 163 BNSS ప్రకారం,ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు పరీక్ష కేంద్రాల వద్ద గుమి కూడరాదు.నిషేదిత వస్తువులతో పరీక్ష కేంద్రాల వద్ద తిరుగవద్దు. అన్ని పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలోని అన్ని జిరాక్స్ సెంటర్ లను 03-06-2025 నుండి తేది: 13-06-2025 వరకు (ఉదయం 08.00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు) మూసివేసి ఉంచాలి.పై నిషేధిత ఉత్తర్వులు నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ పరిధిలో 03-06-2025 నుండి తేది: 13-06-2025 వరకు (ఉదయం 08:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు) అమలులో ఉంటాయనీ తెలిపారు.