నందిపేటలో మహిళ దారుణ హత్య .

నందిపేట్ జై భారత్ మే:27(షేక్ గౌస్) నందిపేట మండలంలోని ఐలాపూర్ రోడ్డుపై గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను హత్య చేశారు. బండరాళ్ల సమీపంలో మృతదేహం లభ్యమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హత్య జరిగిన తీరును పోలీసులు ప్రాథమికంగా పరిశీలించగా, ఉరి వేసినట్లు చంపినట్లు ఆనవాళ్లు గుర్తించారు.నందిపేట్ ఎస్ ఐ చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం హత్యకు గురైన సాదా సుమలత (42), షాపూర్ గ్రామానికి చెందిన ఆమె కూలీగా జీవనం సాగిస్తున్నారు. మే 26న సిహెచ్ కొండూరు గ్రామంలో బంధువుల ఇంటికి ఫంక్షన్‌కు హాజరై, తిరిగి ప్రయాణం లో నందిపేట్ సంతలో కూరగాయల కోసం వెళ్లారు. అయితే రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుమారుడు సాదా సంజయ్, బంధువులతో కలిసి వెతకగా, ఐలాపూర్ వెళ్ళే రోడ్డుపై రైతు ఫారం సమీపంలోని బండరాళ్ల వద్ద ఆమె మృతదేహాన్ని గుర్తించారు.సంజయ్ ఫిర్యాదు మేరకు నందిపేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుల కోసం క్లూస్ టీమ్ తో గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!