నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19
ధర్పల్లి మండలంలోని మొండి చింతల తండా లో నూతనంగా నిర్మించిన జగదంబా మాతా ఆలయ ప్రారంభోత్సవంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు.తండా పెద్ద మనుషులు,గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు,మహిళలు ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని ఘనంగా సన్మానించారు.తండా కు చెందిన పలువురు మాట్లాడుతూ గుడి నిర్మాణం కోసం గత మూడు,నాలుగు సంవత్సరాలుగా ఫారెస్ట్ అధికారులతో చాలా ఇబ్బందులు పడ్డామని కానీ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో గుడి నిర్మాణం పూర్తి చేసుకున్నామని అన్నారు.ఎమ్మెల్యే చొరవతో తండాలో 60 లక్షలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం జరిగిందని,ఇంకొన్ని అభివృద్ది పనులు కూడా జరిగాయని,నూతనంగా నిర్మించిన ఆలయం లో కాంపౌండ్ వాల్,కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే ను కోరుతున్నామని అన్నారు.ఈ సంధర్బంగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి మాట్లాడుతూ…అమ్మవారి దయతో అందరూ బాగుండాలని,తాను ఎమ్మెల్యేగా గెలిచాక మూడు సార్లు తండాకు రావడం జరిగిందని,గుడి నిర్మాణం కోసం ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి గుడి నిర్మాణం జరిగేలా చూశానని,తండా వాసుల కోరిక మేరకు గుడి చుట్టూ ప్రహరీ గోడ కు,కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సైతం నిధులు కేటాయిస్తానని అన్నారు.తండాలో ఇప్పటికే 25 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే వారికి కుడా ఇండ్లు మంజూరు చేస్తామని,తండాలో ఇళ్ళు లేని వారు ఎవరు ఉందవద్దని అన్నారు.కాంగ్రెస్ గిరిజనుల పార్టీ అని,కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని,పదేళ్ల భా.రా.స పాలనతో ఒరిగిందేమీ లేదని,రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో ,ఐసీడీఎస్ చైర్మన్ తార చంద్ నాయక్, మునిపల్లి సాయిరెడ్డి,మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్,బంజారా సేవా సంఘం నాయకులు చంద్రు నాయక్,చెలిమెల శ్రీనివాస్,ఏలాల గంగారెడ్డి,తిరుపతి,తండా పెద్ద మనుషులు తదితరులు పాల్గొన్నారు.