నందిపేట కంఠం గ్రామంలో 24 ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభం

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:19 (షేక్ గౌస్)
నందిపేట మండలంలోని కంఠం గ్రామంలో సోమవారం 24 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని ఏఎంసీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు శుభారంభం చేశారు. ఈ ఇండ్లు గ్రామానికి మంజూరు చేయించేందుకు కృషి చేసిన ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డికి గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు మంజూరవడంతో గ్రామ ప్రజల్లో ఆనందోత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, బీసీ సెల్ అధ్యక్షుడు వెల్మల్ రాజేంద్ర, చిరంజీవి గౌతమ్, గుండ్ల పోశెట్టి, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఇతర గ్రామస్థులు పాల్గొన్నారు.ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ఇంటి నిర్మాణ దశలలో ప్రతి దశలో ఫోటోలు తీసి, జియో ట్యాగ్ చేసి ఇందిరమ్మ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నిర్మాణం కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది.ఈ పథకం పేద ప్రజలకు గృహ కలను సాకారం చేయడమే లక్ష్యంగా అమలవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!