రైతును రాజును చేసిన కేసీఆర్ రాజ్యమే ముద్దు

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:4
అందగత్తె ఆటకు వందనం..అన్నదాత చేతికి సున్నం_అందం హిందోళం, వ్యవసాయం గందరగోళం,ధాన్యం కొనే దిక్కు లేక రోడ్లపాలైన రైతులు,_ఇదే ప్రజాపాల నంటూ కాంగ్రెస్ నీతులు,_గన్నీ బ్యాగ్ లకే గతిలేదు, సర్కార్ కు మతిలేదు ,_రైతు భరోసా రాక రైతుల పాట్లు_అక్కరకు రాని అందాల పోటీలకు రూ. 200కోట్లు_అతివల సౌందర్యం అభివృద్ధికి పెట్టుబడి అనడం సిగ్గుచేటు_అది బ్యూటీ కాంటెస్ట్ కాదు, కాంగ్రెస్ లూటీ కాన్సెప్ట్ _ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా?_రైతు వ్యతిరేక కాంగ్రెస్ హింసారాజ్యం వద్దేవద్దు _ బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి కామెంట్స్
ఖాళీ ఖజానా అంటూ పదేపదే పేద ఏడ్పులు ఏడ్చే కాంగ్రెస్ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీల కోసం అందగత్తెలకు రెడ్ కార్పెట్ పరుస్తూ దేశానికి అన్నం పెట్టే అన్నదాతల చేతికి సున్నం పెట్టడం దుర్మార్గమని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.సర్కారు పెద్దలకు అందం హిందోళం కాగా రాష్ట్రంలో వ్యవసాయం గందరగోళంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు.ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం కొనే దిక్కు లేక రోడ్లపాలైన రైతులను పట్టించుకోకపోవడం విచారకరమని ఆయన ధ్వజ మెత్తారు. కొనుగోలు కేంద్రాలు అలంకార ప్రాయం. రైతులకు కనిపించని అధికారుల దర్శనభాగ్యం. తూకం వేయడానికి కాంటాలు, కొన్న ధాన్యం తరలించడా నికి లారీలు లేని పరిస్థితి. పైగా ఇది ప్రజాపాలనంటూ కాంగ్రెస్ నీతులు చెబుతోంది అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే గన్నీ బ్యాగ్ లకే గతిలేదు, రేవంత్ సర్కార్ కు మతిలేదు అని ఆయన ఎద్దేవా చేశారు. రైతు భరోసా రాక రైతులు నానా పాట్లు పడుతుంటే ఏ మాత్రం అక్కరకు రాని అందాల పోటీలు నిర్వహించ డానికి రూ. 200కోట్లు ఖర్చు పెట్టడం ప్రభుత్వ తిరోగమన విధానాలకు పరాకాష్ట అని ఆయన విమర్శించారు.అతివల సౌందర్యం పెట్టుబడిగా తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచి అభివృద్ధి చేస్తామనడం సిగ్గుచేటు అని ఆయన దుయ్యబట్టారు.అది బ్యూటీ కాంటెస్ట్ కాదు, కాంగ్రెస్ లూటీ కాన్సెప్ట్ అని ఆయన ఆరోపించారు.
ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా?. రైతు వ్యతిరేక కాంగ్రెస్ హింసారాజ్యం వద్దేవద్దు. పదేండ్ల పాలనలో వ్యవసాయానికి స్వర్ణ యుగం తెచ్చి రైతును రాజును చేసిన కేసీఆర్ రాజ్యమే ముద్దు అని తెలంగాణ రాష్ట్ర రైతాంగం ముక్తకంఠంతో కోరుకుంటున్నదని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!