నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మే:1 (షేక్ గౌస్)
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ ఔట్ సోర్సింగ్ సీఎం అని, ఆయన తెలంగాణ ప్రొడక్ట్ కాదు, మ్యాన్ ఫ్యాక్చర్ డిఫెక్ట్ అని మండిపడ్డారు. ఆయన అసలైన కాంగ్రెస్ నేత కాదని, ఆరెస్సెస్‌లో పుట్టి, టీడీపీలో పెరిగి, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న వ్యక్తి అని ఎద్దేవా చేశారు.చంద్రబాబు, మోదీలను మెంటర్లుగా తీసుకుని, బీజేపీ దారితీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ సంస్కృతి ఆకాశమంత అయితే, రేవంత్ గల్లీ భాష మాట్లాడే కుసంస్కారి అని ధ్వజమెత్తారు.రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్‌ను విమర్శించడం అన్యాయమని, కేసీఆర్ తత్వం అభివృద్ధికి పునాది అయితే, రేవంత్ తత్వం అభివృద్ధికి సమాధి అని ఆరోపించారు. లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలంటూ సవాల్ విసిరారు.ప్రస్తుత పాలనలో పథకాలు ఎక్కడాయని నిలదీశారు. 24 గంటల కరెంట్, రైతు బంధు, దళిత బంధు, మిషన్ భగీరథ వంటి పథకాలు కనపడడం లేదని విమర్శించారు. చివరగా, రేవంత్ పాలనపై విమర్శలు ఆపి, పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.ఇతర నేతలతో పాటు జెడ్పీటీసీ, ఎంపీపీలు, బీఆర్ఎస్ నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.