నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:-24
ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పహల్గామ్ అమరులకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులు సంతాపం తెలిపారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. ప్రభుత్వం ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచి వేయాలని కోరారు. నిరసన కార్యక్రమాన్ని ఎస్సారెస్పీ టీఎన్జీవో యూనిట్ అధ్యక్షుడు ప్రవీణ్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.