నిజామాబాద్ జిల్లా ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:16
“తులం బంగారం అడిగితే లాఠీ ఛార్జా?” – మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి.
తాజా మంత్రి vs మాజీ మంత్రి.. భీమ్‌గల్‌లో రాజకీయ సంగ్రామం!
నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండల కేంద్రంలో జరిగిన కళ్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసబస గా మారింది. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తున్న సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలతో గందరగోళం అయింది.మంత్రి జూపల్లి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కట్టుబడి ఉందని, గత బీఆర్ఎస్ పాలన అప్పులపాలు చేసిందని, ఇప్పుడు ఆ వడ్డీలు కట్టడానికే ఖజానా ఖాళీ అయిపోయిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు విన్న మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వేదికపై బహిరంగంగా ఖండించారు.అదే అదునుగా కార్యకర్తలు అరుపులు, నినాదాలు, తోపులాటలు చేస్తూ గందరగోళ పరిస్థితిని నెలకొల్పారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తేవాలని ప్రయత్నించే లోపు కొంతమంది ఇసుక విసరడంతో ఉద్రిక్తత గా మారీ, చివరికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేసే పరిస్థితి వచ్చింది
ఈ క్రమంలో, ప్రశాంత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. “కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం అడిగినందుకేనా లాఠీ ఛార్జ్? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.