నిజామాబాద్ ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక ఏప్రిల్:6 (షేక్ గౌస్)
నందిపేట మండలంలోని కంటం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఆదివారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెంట ఇంద్రుడు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీటి సౌకర్యం, టెంట్ల ఏర్పాటు వంటి విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలని అధికారులను కోరారు. రైతులు సజావుగా ధాన్యం విక్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తవ్వాలన్నారు. ఐకేపీ సిబ్బంది పూర్తినిష్టతో సేవలందించాలని సూచించారు.కార్యక్రమంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు సాయికుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిరంజీవి, బీజేపీ సీనియర్ నాయకుడు మేర రాములు, దారం రాజు, గుండ్ల పోశెట్టి, దారం పోశెట్టి తదితరులు పాల్గొన్నారు.
.