అన్ని రంగాల అభివృద్ధికి మొండి చేయి-అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త

తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి జై భారత్ తెలుగు దినపత్రిక మార్చ్:-25 

 

మంగళ వారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులపైన చర్చలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతు…తెలంగాణలో దేవాలయ భూముల ఆక్రమణ అనేది తీవ్రమైన సమస్యగా మారిందని తెలంగాణ రాకముందు 87235 ఎకరాల దేవాదాయ భూములు ఉండేవి అన్నారు.తెలంగాణ వచ్చిన తరువాత 20124 ఎకరాల దేవాదాయ భూములు కబ్జాకు గురి అయితే కేవలం 1146 ఎకరాలకు మాత్రమే కేసులు నమోదు అయ్యాయని అన్నారు.కబ్జాకు గురి అయినా మిగితా భూముల లెక్క ప్రభుత్వం దెగ్గర ఉందా ? ఉంటె దాని పైన ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలన్నారు.వేలాది కోట్ల ఆదాయం దేవాలయాల నుండి వస్తుంటే వాటి నిర్వహణ అధ్వాన స్థితి లో ఉన్నాయని కేవలం 190 బడ్జెట్ తో వాటి అభివృద్ధి ఏ విదంగా సాధ్యమో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు.దేవాలయాలు అన్ని కూడా పర్యవేక్షణలో ఉంచి వాటి కోసం ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేయాలి ఎందుకంటే గడిచిన సంవత్సర కాలం లో తెలంగాణ లో 100 పైగా హిందూ దేవాలయాలపైనా దాడులు జరిగితే ప్రభుత్వం అస్సలు ఎందుకు స్పందించలేదో స్పష్టం చేయాలన్నారు.ఇటీవల సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ దేవాలయంలో దుర్గామాత విగ్రహం ధ్వంసం చేయబడింది, ఇది భక్తులలో ఆగ్రహాన్ని రేకెత్తించిందని. అలాగే, శంషాబాద్లోని ఎయిర్పోర్ట్ కాలనీలో ఉన్న హనుమాన్ దేవాలయంలో నవగ్రహ విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది, ఇది స్థానికుల్లో ఉద్రిక్తతను సృష్టించింది. ఈ సంఘటనలు భక్తుల భద్రతపై ప్రశ్నార్థకంగా నిలుస్తున్నాయని వాపోయారు.ఇటీవల దాడులలో విగ్రహాలు ద్వాంస మైన ప్రతిగుడికి పునః ప్రతిష్టాపనకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించేలా నిధులు కేటాయించాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం “హిందూ పుణ్యక్షేత్రాల యాత్ర పథకం” తీసుకురావాలి అధ్యక్షా !!

హజ్ యాత్ర తరహాలో ప్రతి నియోజాకవర్గం నుండి కనీసం 500 మంది భక్తులకు చార్ధామ్ యాత్ర (కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి) కు ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాలన్నారు.ఇటీవల దాడులలో విగ్రహాలు ద్వాంసం అయినా ప్రతిగుడికి పునః ప్రతిష్టాపనకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించేలా నిధులు కేటాయించాలని డిమాండ్ చేసారు.ఎండోమెంట్ బడ్జెట్ను ₹1,000 కోట్లకు పెంచాలని కేరళ ‘ట్రవణ్ కోర్ దేవస్వామ్ బోర్డు’ మాదిరిగా తెలంగాణాలో కూడా ఒక “తెలంగాణ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ” ఏర్పాటు చేసి, ఆలయాల నుండి వచ్చే ఆదాయాన్ని పారదర్శకంగా స్థానిక అభివృద్ధికి వినియోగించాలని డిమాండ్ చేసారు.టూరిజం, ఆర్ట్ అండ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ ”కు ₹1,411 కోట్లు కేటాయించారని. ఏంతో ఘన చరిత్ర కలిగిన సాంస్కృతిక , కళల ,సంప్రదాయాల ,మరియు పురాతన నిర్మాణాల అభివృద్ధికోసం మరియు పరిరక్షణ కోసం “పర్యాటక ప్రాజెక్ట్స్”కు ₹721 కోట్లు రూపాయలను ఈ బడ్జెట్ లో కేటాయించారు.ఇది మొత్తం బడ్జెట్లో 0.46% మాత్రమే! అన్నారు.ఈ బడ్జెట్ చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటకాన్ని రంగాన్ని “పరిహాస” రంగంగా మార్చినట్లుందని అనిపిస్తుందన్నారు.దేశంలో బిజెపి పాలిత అనేక రాష్ట్రాలలో పర్యాటక రంగం పై ప్రత్యేక దృష్టి సారించి కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజానాకు జమచేస్తున్నారని అన్నారు.ప్రత్యక్షంగా వందలాది కుటుంబాలకు పరోక్షంగా వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని ఉదాహరణకు గుజరాత్ రాష్ట్రం లో “స్టాచ్యూ ఆఫ్ యూనిటీ”, “రణ్ ఆఫ్ కచ్” వంటి ప్రాజెక్టులతో ఆదాయం పెంచుకుంటున్నారని అన్నారు పర్యాటక రంగం కోసం బడ్జెట్ లో కేటాయించిన నిధులను చూస్తే అసలు ఈ ప్రభుత్వానికి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే ఆలోచన ఎంత మేరకు ఉందో ఇట్టే అర్థం అవుతుందని ఏద్దేవా చేసారు.కాంగ్రెస్ ప్రభుత్వం మరియు మంత్రులు హెలికాప్టర్ లో టూర్లు వేసిన శ్రద్ధ రాష్ట్ర టూరిజం అభివృద్ధిలో పెట్టాలన్నారు.భారత పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండియా టూరిజం డేటా కంపెండియం 2024 ప్రకారం దేశీయ పర్యాటక సందర్శకుల సంఖ్య రాష్ట్రము లో గణణీయంకా పడిపోయిందన్నారు.దాదాపు 9 కోట్ల దేశీయ పర్యాటకులు, లక్షన్నర విదేశీ పర్యాటకులు వస్తున్నప్పడికి వారికీ సరైనటువంటి వసతులు లేకపోవడం వల్ల వాళ్ళు త్వరగా తిరిగి వెళ్లిపోతున్నారు 2 /3 రోజులు ఉండే వసతులు కల్పించినట్టు అయితే పర్యాటక రంగం ఇంకా అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఉదాహరణకు కుంటాల వాటర్ ఫాల్స్ తీసుకంటే అక్కడే పర్యాటకులు ఉండేందుకు ఎలాంటి వసతులు లేవు అన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయం లో టూరిజం పాలసీ లేకపోవడం బాధాకరం అని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నూతన టూరిజం పాలసీ ని స్వాగతిస్తున్నాం కానీ దాన్ని చిత్తశుద్ధి తో అమలు చేయాలనీ డిమాండ్ చేసారు టూరిజం 2025 -30 పాలసీ లో రాష్ట్రము లోని ముఖ్యంగా 27 పర్యాటక ప్రాంతాలను గుర్తించారు మరియు వాటిని అభివృద్ధి చేస్తాము అంటున్నారు 775 కోట్ల బడ్జెట్ తో 27 ప్రాతాల అభివృద్ధి సాధ్యమా అని ప్రశ్నించారు.పాలసీ లో పేర్కొన్న విధంగా వచ్చే 5 ఏళ్లలో 15000 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షింస్తాం అని అంటే ప్రతి ఏటా 3000 కోట్లు ఒక వెల నిర్దిష్ట సమయం లో పెట్టుబడులు ఆకర్షించలేకపోతే ప్రభుత్వం దగ్గర ఉన్న ఆల్ట్రనేటివ్ ఎం ఉంది ? ప్రభుత్వమే ఆ నిధులు సమకూరుస్తుందా ? సమాధానం చెప్పాలన్నారు.

కేవలం ప్రాంతాల పేర్లు అండ్ స్థలాలు చెప్పారు కానీ పాలసీ లో వాటిని ఏ రకంగా అభివృద్ధి చేస్తారో సరైన డి పి ఆర్ లేదన్నారు.ప్రభుత్వం పాలసీ లో పేర్కొన్న 27 ప్రాంతాలతో పాటు మా ఇందూరు అర్బన్ లో ఉన్నటువంటి ఖిల్లా రామాలయాన్ని కూడా అందులో చేర్చి అభివృద్ధి చేయాలన్నారు.

గుజరాత్ లాగా ఇక్కడ కూడా “తెలంగాణ టూరిజం అభివృద్ధి బోర్డ్” ఏర్పాటు చేయండం ద్వారా పర్యటక రంగంలో మెరుగైన ఫలితాలు రాబటవచ్చు తెలియజేసారు.ఆర్ట్స్ అండ్ కల్చర్ తెలంగాణలో సాంస్కృతిక కళలు నిరాదరణకు గురి అవుతున్నాయని అన్నారు.నిజానికి తెలంగాణలో ఒకప్పుడు 160కి పైగా జానపద, కళారూపాలు ఉండేవి, అందులో చాలావరకు అంతరించి పోతున్నాయని వాటిని కాపాడే బాధ్యత తెలంగాణ ప్రజా ప్రతినిధులుగా అందరిపైన బాధ్యత ఉందన్నారు.దీనికి సంమంధించి ఒక నూతన సాంస్కృతిక పాలసీ ని ప్రభుత్వం తీసుకురావాలని అన్నారు. కళా ప్రదర్శనలకు ప్రతి జిల్లాలో ఒక వేదికను ఏర్పాటు చేయాలని, హైదరాబాద్లోని రవీంద్ర భారతి లాగే ప్రతి జిల్లాలో మినీ రవీంద్రభారతిలను ఏర్పాటు చేయాలని కోరారు.ముఖ్యంగా ఇటీవల జరిగిన ఒక సంఘటన అధ్యక్షా నన్ను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.స్టేషనఘన్పూర్ మండలంలోని శివునిపల్లిలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభలో తెలంగాణ ఉద్యమ కళాకారులు నిరసన తెలుపగా దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులు వారి వద్ద ఉన్న ఫ్లెక్సీని లాగేశారని

సీఎం ప్రసంగం అనంతరం ఉద్యమ కళాకారులు తమ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని నెట్టేశారని వారిని సభావేదిక నుంచి మహిళాపోలీసులు బలవంతంగా బయటకు తీసుకువచ్చారన్నారు.తెలంగాణ రాష్ట్రము కోసం పాటలు, ధూంధాంలతో ఉద్యమించినా అందరు కళాకారులకు ఉద్యోగ ఉపాధి పెన్షన్ కల్పించాలని డిమాండ్ చేసారు.అలాగే గతం లో మంత్రి జూపల్లి అర్హులైన కళాకారులందరికీ దివ్యాంగులతో సమానంగా రూ.6 వేల చొప్పున పెన్షన్ ఇచ్చే అంశాన్ని సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు మరి అది ఎప్పడికల్లా వర్తింప చేస్తారో చెప్పాలి దానికి సమందించి బడ్జెట్ లో కేటాయించిన నిధులు ఎన్నో కూడా చెప్పాలన్నారు.దేశం మనదే …తేజం మనదే …ఎగురుతున్న జండా మనదే ….. పాట పాడి , జై సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న నేరేడుకొమ్మ శ్రీనివాస్ … తెలుగువారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటిన బతుకమ్మ పాటను హాలీవుడ్ చిత్రము “ది ఇండియన్ పోస్ట్ మాన్” లో పాడిన అమర గాయకుడు జై శ్రీనివాస్ కరోనా తో మరణిస్తే, అప్పటి ప్రభత్వం పట్టించుకోలేదు ఈ రోజు వారీ కుటుంబం రోడ్డున పడిందని అలాంటి కళాకారులెందరో తెలంగాణా లో ఉన్నారని వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేసారు స్పోర్ట్స్ అండ్ యువత సేవలు గత బడ్జెట్ తో పోలిస్తే ఈ బడ్జెట్ లో స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ కి 100 కోట్ల బడ్జెట్ పెంచిన కానీ ఆ నిధులు సరిపోవు అన్నారు.కేంద్ర ప్రభుత్వం ఖేళో ఇండియా ను ప్రతిష్ఠాత్మనంగా తీసుకొని దేశం లోని యువతను క్రీడారంగం వైపు ప్రోత్సహిస్తూ ఫిట్ ఇండియా ను సాధించాలనే లక్ష్యం తో ముందుకు పోతున్న క్రమంలో మన తెలంగాణ రాష్ట్రము వెనకబడి ఉందన్నారు.హైదరాబాద్ లోని హకీంపేట్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణాన్ని స్వాగటిస్తున్నాం అన్నారు. అదే విధంగా ప్రతి జిల్లా కేంద్రం లో ఒక మినీ స్టేడియం కూడా నిర్మిస్తే బాగుంటుందన్నారు.హైదరాబాద్ కు చెందిన బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపీచంద్ మరియు పి.వి. సింధు, షూటింగ్లో ఈషా సింగ్, క్రికెట్లో మహ్మద్ సిరాజ్ వంటి వారు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారన్నారు.ప్రతిభ ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధిపై సరైన దృష్టి పెట్టడం లేదని 2025-26 బడ్జెట్లో క్రీడల అభివృద్ధికి ₹500 కోట్లు కేటాయించబడినట్లు ప్రకటించబడింది అన్నారు.జాతీయ అంతర్జాతీయ అవార్డులతో పాటు అర్జున అవార్దులు మరియు బంగారు పథకాలు అందుకున్న ఎండల సౌందర్య, హుసముద్దిమ్ మహ్మద్, నీకత్ జారీన్ కె ఆనంద్ వంటి అనేక క్రీడాకారులు మా నిజామాబాద్ జిల్లా కు చెందిన వారు ఉన్నారని అన్నారు.నిజామాబాద్ నగరంలోని 6 ఎకరాల పైచిలుకు విస్తీర్ణం లో ఉన్నటువంటి పాత కలెక్టరేట్ స్థలము మరియు అనుకోని ఉన్న గ్రౌండ్ ను మినీ స్టేడియం నిర్మించాలన్నారు.అలాగే పాత ఇరిగేషన్ భవనం యొక్క 2 ఎకరాల స్థలంలో ఇన్డోర్ స్టేడియం నిర్మించాలన్నారు.అదే విదంగా 30 సంవత్సరాల క్రితం 15 ఎకరాలలో ఏర్పాటు చేసిన రాజారామ్ స్టేడియం లో ఇప్పడివరకు ఎటువంటి సౌకర్యాలు లేక నిరాదరణకు గురి అయిందని రాజారామ్ స్టేడియం ను వెంటనే పూర్తి స్థాయి క్రికెట్ స్టేడియం గా అభివృద్ధి చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు దేశానికి, రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చేందుకు నిజామాబాద్ బిడ్డలు సిద్ధంగా ఉన్నారని కేవలం ప్రభుత్వ ప్రోత్సాహం సరైన వసతులు లేక ఫుల్ టైం కొచ్చేస్ లేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని పేర్కొన్నారు.గతంలో మంత్రి కి పలు మార్లు విన్నవించినట్లుగా ఈ బడ్జెట్ లో అయినా నిధులు కేటాయించాలని డిమాండ్ చేసారు.

చదువు గత ప్రభుత్వ హయంలో – విద్యను సర్వ నాశనం చేసిండ్రు అన్నారు దాదాపు 20 వేల బడులు మూతపడ్డాయన్నారు.మమ్మల్ని గెలిపిస్తే – బడ్జెట్లో 15 శాతం నిధులను కేటాయిస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారం వచ్చాక బడ్జెట్లో విద్యకు 7.9 శాతం నిధులనే కేటాయించింది. స్వయంగా ముఖ్య మంత్రి చూస్తున్న విద్యా శాఖా కు కాంగ్రెస్ హామీ ప్రకారం 15 శాతం నిధులు లేవు అన్నారు.ఎన్నికల్లో హామీ ప్రకారం విద్య శాఖకు 15 శాతం అంటే సుమారు 45 వేల కోట్లకుపైగా నిధులను కేటాయించాలని డిమాండ్ చేసారు ప్రస్తుత బడ్జెట్ లో కేవలం 7.9 శాతం నిధులు మాత్రమే కేటాయించారు అన్నారు.మన దగ్గర 1,023 రెసిడెన్షియల్ స్కూళ్లలో 662కి సొంత భవనాలు లేవని ఆర్థిక మంత్రి గారే చెప్పారని ఈ సమస్యను పరిష్కరించే కార్యాచరణ ఎక్కడ? అని ప్రశ్నించారు.“యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ” అని గొప్పగా చెప్పారు—కానీ దానికి కేటాయింపు ఎంతో స్పష్టంగా చెప్పలేదు. అంతేకాకుండా రాష్ట్రంలో వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలల భవనాలు శిధిలావస్థలో ఉన్నాయని అందులోనే విద్యార్థులకు తరగతుల నిర్వహణ జరుగుతుందని ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థులు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి.పక్క భవనాలు లేని పాఠశాలలకు నూతనంగా భవనాలు నిర్మించాలి.కనీస సౌకర్యాలు అయిన మరగుదొడ్లు,మంచినీటి సౌకర్యం ,వెంటనే సమకూర్చాలన్నారు.అలాగే విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా ఏమైందని ప్రశ్నించారు,ఓవైపు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా మరోవైపు భరోసా కార్డు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటాలు ఆడుతుందని మండిపడ్డారు.విద్యాలయాలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 38 రెసిడెన్షియల్ స్కూళ్లలో 886 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అనారోగ్యానికి గురి అయ్యారన్నారు.రాష్ట్రంలో వరుసగా జరుగుతున్నటువంటి ఈ దుర్ఘటనలతో తల్లిదండ్రులు తమ పిల్లలను వసతిగృహాలకు పంపేందుకు భయపడుతున్నారని గురుకులాల్లో చదివే పిల్లల తల్లిదండ్రులుకు సమాధానం చెప్పాలన్నారు.తెలంగాణను మత్తు పదార్థాల అడ్డాగా మారిందని రోజుకు 70-80 వరకు నమోదవుతున్నాయని పేర్కొన్నారు.గత పదేళ్లలో మద్యం షాపుల సంఖ్య రెట్టింపు అయ్యాయని అన్నారు.గుడికి , బడికి 500 మీటర్ల పరిధిలో మద్యం షాపులు ఉండకూడదు అనేది నిబంధనను కఠినంగా అమలు చేయాలనీ డిమాండ్ చేసారు.దేవుళ్ళ పేర్లతో వైన్ షాపులకు బార్లకు పేర్లు పెట్టకుండా ఉండే విధంగా చట్టం తీసుకురావాలి అని సూచన చేసారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!